
అమరావతి: బాపట్లలోని దరివాద కొత్తపాలెంలో బావిలో పడి బాలుడు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకున్న బాలుడు కనిపించకపోవడంతో తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రోజు ఉదయం బావిలో బాలుడి మృతదేహం లభ్యం అవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సాయిగా పోలీసులు గుర్తించారు.