Reading Time: < 1 minute

అమరావతి: కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు సమీపంలో టిడ్కో ఇళ్ల వద్ద ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎదురుగా వాహనాలు రాకపోవడంతో సురక్షితంగా బయటపడటం కారణంగా వారంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ప్రయాణికులను మరో బస్సుకు పంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమెదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.