
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ నేడు వెలువడే అవకాశం ఉంది. ఉద యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, డిజిపి శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి.. మధ్యా హ్నం తర్వాత షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిప ల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు పూర్తిచేసింది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయిన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఎంపిక, సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి చేసిన ఎస్‌ఇసి.. అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. పోలింగ్, కౌం టింగ్ కేంద్రాల ఎంపిక వంటి కీలక అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పోరేషన్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన వివరాలు ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నివేదించిన విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి.