
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ రాజ్యసభ స భ్యులు జోగినపల్లి సంతోష్ రావుకు సోమవారం నోటీసులు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల ని సిఆర్‌పిసి 160 నోటీసులు అందచేశారు. కా గా, ఇప్పటికే సిట్ అధికారులు హరీష్ రావు, కెటిఆర్‌లను ఏడు గంటల చొప్పున విచారించి వాం గ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో సంతోష్ రావు ను విచారణకు పిలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, సిట్ అధికారులు జారీ చేసిన నోటీసు ల్లో మాజీ రాజ్య సభ్యుడిగా ఉన్న సంతోష్ రావును రాజ్యసభ్యుడిగా పేర్కొనడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
సిట్ విచారణకు హాజరవుతా
సిట్ నోటీసులపై మాజీ రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు స్పందించారు. నోటీసులు అందాయని, విచారణకు హాజరవుతానని తెలిపారు. సిట్ విచారణకు సహకరిస్తానని, కేసుకు సంబంధించి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవిస్తానని, విచారణను ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.