Reading Time: < 1 minute

హరిద్వార్ ః ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలకు ఇకపై కేవలం హిందువులనే అనుమతిస్తారు. హిందూయేతరులకు నిషేధం విధించాలని ఆలయాల నిర్వాహక కమిటీ నిర్ణయించింది. తొందర్లో జరిగే బద్రీనాథ్ కేదారినాథ్ ట్రస్టు కమిటీ (బికెటిసి) బోర్డు సమావేశంలో తీర్మానం చేసిఆమోదించనున్నారు. కమిటీ ప్రతిపాదన వివరాలను మీడియాకు ఛైర్మన్ సురేష్ సెమ్వాల్ సూచనప్రాయంగా తెలిపారు. ఆదివారం కమిటీ కమిటీ బోర్డు పూర్తి స్థాయి సమావేశంలో నిర్ణయం వెలువడుతుంది. దీనిని పూర్తి స్థాయిలో ఆలయాల బోర్డు పరిధిలోకి వచ్చే ఇతర క్షేత్రాలు గంగోత్రి , ముఖుంబకు కూడా వర్తిస్తాయి.

ఆలయాల పురాతన సాంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరించాలనే ఆలోచనలతోనే ఇతర మతస్తులకు ఆలయ నిషేధం విధించనున్నట్లు తెలిసింది. ఈ రెండు ఆలయాలు ఉత్తరాఖండ్‌లో నెలకొని ఉన్నాయి, ఛార్‌ధామ్ యాత్రలో భాగంగా ఆలయాలను ఏటా లక్షలాది భక్తులు సందర్శిస్తారు. శీతాకాలం లో ఆరు నెలల పాటు ఆలయాలు మూసివేస్తారు. తిరిగి ఏప్రిల్ 23న తలుపులు తెరుచుకుంటాయి. గతంలో మతాచారాలకు విరుద్ధంగా ఆలయాల్లోకి అందరిని అనుమతిస్తూ వచ్చారు. దీనిని గుర్తించి చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.