
మంచు తుపాను కారణంగా విమానం కూలిన సంఘటన అమెరికాలోని బాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. ఎనిమిది మందితో ఓ ప్రవేటు బిజినెస్ విమానం ఆదివారం రాత్రి 7.45 గంటల( భారత కాలమానం ప్రకారం) సమయంలో బాంగోర్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. విమానాశ్రయం నుంచి కొంతదూరం వెళ్లగానే విమానం కూలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారిలో ఏడుగురు మంటల్లో కాలి చనిపోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అధికారులు విమానాశ్రయంను మూసివేశారు. ఘటన సమయంలో దట్టంగా మంచు కురుస్తున్నట్లు సమాచారం.