Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ఇండియా ఇయూ మధ్య బలోపేత సంబంధాలు రిపబ్లిక్ డే వేడుకలకు ఇయూ నేతల రాకతో స్పష్టం అయిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇయూ కౌన్సిల్ , కమిషన్ సారధులు ఈసారి వేడులకు ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. రెండు పక్షాలూ ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయి. ఇదే క్రమంలో ఐరోపా సమాఖ్యతో భారతదేశ అనుబందం విస్తరించుకొంటోందని తెలిపారు. ఆంటోనియో కోస్టా, ఉర్సులా వా అతిధులుగా రావడం గర్వకారణం అన్నారు. విభిన్న రంగాలలో భారత్ ఐరోపా దేశాల మధ్య స్నేహ సహకారం విస్తరణకు ఇయూ నేతల భారత్ సందర్శన దోహదం చేస్తుందని ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.