Reading Time: < 1 minute

వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బిఆర్‌ఎస్ ఆహ్వానం మేరకు త్వరలో పెద్ద ఎత్తున అనుచరులతో ఆ పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌లో చేరడం అంటే తన సొంత ఇంట్లోకి వెళ్ళినట్లేనని ఆయన పేర్కొన్నారు. బిజెపిలో తనకు ఇంత కాలం సహకరించిన వారందరికీ అరూరి రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.