Reading Time: < 1 minute

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్ రెడ్డి’. ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ‘డేవిడ్ రెడ్డి‘ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంచ్ చేశారు.

ఈ పోస్టర్స్‌లో రూత్‌లెస్, బ్రూటల్ అనే రెండు లుక్స్‌లో మంచు మనోజ్ ఇంటెన్స్ గా కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు లుక్స్ చూస్తే మూవీలో అద్భుతమైన యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది. మంచు మనోజ్ తన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, లుక్స్, నటనతో డేవిడ్ రెడ్డి పాత్రకు లైఫ్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ‘డేవిడ్ రెడ్డి‘ సినిమాను ప్రతిష్టాత్మకంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్ క్రూర పాలనకు ఎదురునిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు.