Reading Time: < 1 minute

హైదరాబాద్: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. జయ జయ జయహే అనే మలయాళ మూవీకి ఇది రీమేక్‌. ఎ.ఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. భార్య మధ్య జరిగే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌లా ఈ సినిమాను తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాల మధ్య జరిగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సినిమా ట్రైలర్‌ చూసేయండి..