Reading Time: < 1 minute

మన తెలంగాణ/మాచారెడ్డి: విష ప్రయోగంతో 600 కుక్కలను హతమార్చిన ఘటనలో మాచారెడ్డి మండలంలోని ఐదుగురు సర్పంచులపై కేసు లు నమోదయ్యాయి అయితే ఈ అం శం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రా ష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిం ది. స్ట్రే యూనిమల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కుక్కలపై విషప్రయోగం జరిగిన విషయాన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే గ్రామాల్లో అంతర్గతంగా బయటకు పొక్కకుండా జరిగిన ఈ ఘటన ఫౌం డేషన్ ప్రతినిధులకు ఎలా తెలిసింద న్న ప్రశ్నలు సర్పంచులను ఉక్కిరిబిక్కి రి చేస్తున్నాయి. ప్రజలను కుక్కల బెడ ద నుంచి కాపాడేందుకు చేసిన ఘట న ఒక్కసారిగా తమ మెడకు చుట్టుకోవడంతో ఆ సర్పంచులు ఏం చేయా లో తెలియని సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఈ క్రమంలో అసలు ఎన్జీవోలకు ఈ విషయం ఎలా తెలిసింద న్న దానిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ యా గ్రామాల్లో ప్రజల నుంచి వేర్వేరు గా సమాచారం తెలుసుకునే పనిలో పడ్డట్లుగా ప్రచారం సాగుతోంది. గ్రామం దాటి బయటకు వెళ్లని విషయం ఏకంగా జంతు ప్రేమికులకు చేరవేయడంలో ఎవరి హస్తం ఉందని తెలుసుకునే ప్రయత్నంలో సర్పంచులు ఉన్నట్లుగా సమాచారం.