Reading Time: < 1 minute

థాయిలాండ్ దక్షిణ ప్రాంతంలో బుధవారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణరంగంలో ఉపయోగించే కన్ స్ట్రక్షన్ క్రేన్ నడుస్తున్న ప్యాసింజర్ రైలు పై పడడంతో మంటలు చెలరేగాయి. రైలు పట్టాలు తప్పింది, ప్రమాదంలో 30 మందికి పైగా చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు.చైనా ను ఆగ్నేయాసియా లోని చాలా ప్రాంతాలను కలిపే హైస్పీడ్ రైలు ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమంలో ఉన్న కన్ స్ట్రక్షన్ క్రేన్ రైలుపై కుప్పకూలింది. రైలులో 171 మంది ప్రయాణికులు ఉండగా, నలుగురి జాడ తెలియడం లేదు. క్రేన్ పడడంతో బోల్తా పడిన బోగీల కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక సిబ్బంది గాలిస్తున్నారు. పలువురిని రక్షించారు.

ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం పై విచారణకు రవాణ శాఖ మంత్రి ఆదేశించారు. హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టులో ఎత్తైన భాగాన్ని నిర్మించడానికి క్రేన్ ను ఉపయోగిస్తున్నారు. ఆ క్రేన్ బ్యాంకాక్ నుంచి ఉబోన్ రట్చథాని ప్రావిన్స్ కు వెళ్తున్న రైలు పై పడిపోయింది.మొత్తం 520 బిలియన్ బాట్ ( 16.8 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడితో రెండు దశలలో ఈ రైల్వే ప్రాజెక్టు సాగుతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనాను ఆగ్నేయాసియాతో అనుసంధానం చేసే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.