
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు ఇది రీమేక్. ఎఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ జనవరి 30వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వస్తున్న జంటలకు ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అంటూ ప్రకటించింది. ఇప్పటికే టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది చిత్ర యూనిట్. సింగిల్ స్క్రీన్‌లో రూ.99, మల్టీప్లెక్స్‌లలో రూ.150కే టికెట్‌ని కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. తాజాగా కపుల్స్‌కు ఈ 1+1 ఆఫర్‌ను ఇచ్చింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ఆశపడుతోంది.