Reading Time: < 1 minute

ముంబయి: మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి విమానం కూలిపోవడంతో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందారు. పవార్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు, రాజకీయ ప్రముఖలు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఫోన్‌లో ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. విమాన ప్రమాదంపై వివరాలను మోడీ, అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. 

ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయానని పిఎం మోడీ బాధను తెలియజేశారు. ఇలాంటి సమయంలో మృతుల కుటుంబాలకు మనో ధైర్యం కోసం ప్రార్థిస్తున్నానని,  అజిత్ పవార్ ప్రజా నాయకుడు, అట్టడుగు స్థాయి నుంచి ఎదిగారని కొనియాడారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో ఉన్న కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారని ప్రశంసించారు. పరిపాలనా విషయాలపై ఆయనకున్న అవగాహన, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో పని చేసేవారని మోడీ గుర్తు చేశారు.