
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ రాజ్యసభ్య సభ్యులు, బిఆర్‌ఎస్ కీలక నేత జోగినపల్లి సంతోష్ రావును సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారించింది. మంగళవారం మధ్యాహ్నాం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల పాటు సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు. మధ్యాహ్నం 3 గంటలకు సంతోష్‌రావు జుబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. సిట్ విచారణలో ప్రధానంగా పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబి చీఫ్‌గా నియమించడానికి కారణం ఏమిటి? ఇది ఎవరి నిర్ణయమని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభాకర్‌రావు బృందానికి తరచు ఫోన్ ట్యాపిం గ్ చేయాల్సిన నంబర్లు అందాయని వాటిని పంపించడంలో ఎవరి ప్రమేయం ఉందని ఆరా తీసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ చేసిన పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల నంబర్ల జాబితా సంతో ష్‌రావుకు చూపించి వాటిని ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు? అని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో హరీష్ రావు, కెటిఆర్‌ను ఇప్పటికే ఏడు గంటల పాటు సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ అధికారులు తదుపరి ఎవరికి నోటిసులు ఇచ్చి పిలువనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇంతటితో సిట్ విచారణ ముగించి చార్జిషీటు దాఖలు చేస్తారా? లేక మరి కొందరని విచారిస్తారా? అనేది సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది.