
రాష్ట్ర పోలీస్ శాఖలో ఐదుగురు డిఎస్పిలు బదిలీ చేస్తున్నట్లు డిజిపి బి.శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డిఎస్పి, ఇల్లందు ఎస్‌డిపిఓగా విధులు నిర్వహిస్తోన్న ఎస్.సారంగపాణి వైరా ఏసిపిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో డిఎస్పిగా ఉన్న పద్మనాభుల శ్రీనివాస్ జిహెచ్‌ఎంసి అదనపు ఎస్పిగా, ఇంటెలిజెన్స్ డిఎస్పిగా విధులు నిర్వహిస్తున్న యు. వెంకన్నబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎస్‌డిపిఓగా, సైబరాబాద్ ఎస్‌బి ఏసిపిగా ఉన్న బి. ప్రకాష్ నిజామాబాద్ ఏసిపిగా బదిలీ చేశారు. నిజామబాద్ ఏసిపిగా ఉన్న ప్రకాష్‌ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.