Reading Time: < 1 minute

మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా హై టెన్షన్ మ్యాచ్ జరుతుంది. ముంబై ఇండియన్స్ జట్టుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పొయి 199 పరుగులు చేసింది. నాట్ సీవర్ బ్రంట్ (100: 57 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేసింది. ఓపెనర్ హేలీ మాథ్యూస్(56:39 బంతుల్లో 9 ఫోర్లు) హఫ్ సెంచరీ చేయగా, హర్మన్ ప్రీత్ కౌర్(20) పరుగులు చేసింది. నాట్ సీవర్, హేలీ 73 బంతుల్లో 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్సిబి బౌలర్లలో లారెన్ బెల్ 2, శ్రేయాంక పాటిల్, నదైన్ డి క్లర్క్ తలో వికెట్ పడగొట్టారు.