Reading Time: < 1 minute

కెనడా దేశంలో దారణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన దిల్ రాజ్ సింగ్ గిల్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. వాంకోవర్ వాసి అయితన దిల్‌రాజ్ హత్య వెనుక గ్యాంగ్‌వార్ కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్ కొలంబియాలోని బర్నబే వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ నెల 22న ‘3700 కెనడా వే’లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు చేరుకొనే సరికి ఓ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్నాడు. అతడిని కాపాడేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత బక్స్‌టోన్‌ వీధిలో ఓ వాహనం తగలబడటాన్ని అధికారులు గుర్తించారు. ఈ రెండు ఘటనలకు సంబంధం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దిల్‌రాజ్ అక్కడి పోలీసులకు తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం.