Reading Time: < 1 minute

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రాజెక్టు రామాయణ. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతా దేవిగా సాయిపల్లవి.. రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ క్రేజీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా.. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో కలిసి నిర్మిస్తున్నారు.

హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఈ మూవీ టీటర్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమై విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రాముడి అవతారంలో రణబీర్ కపూర్ లుక్స్ బాగున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక, హనుమంతుడిగా సన్నీ డియోల్.. లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా IMAXలో విడుదల కానుంది.