Reading Time: < 1 minute

Chiranjeevi: హనుమంతుడిని తాకిన సూర్యకాంతి.. చిరంజీవి ఇంట్లో పూజా మందిరంలో అద్భుతం!

Caption of Image.

మెగాస్టార్ చిరంజీవికి  ‘హనుమంతుడు’ ఎంత ఆరాధ్యదైవమో తెలిసిందే. తన ఇష్టదైవంగా, కొణిదెల కుటుంబ ఇలవేల్పుగా ఆయన భక్తితో పూజిస్తూ వస్తున్నారు. హనుమంతుడి ఆశీస్సులే తమకు బలం అని ఆయన ఎన్నోసార్లు పేర్కొన్నారు.

గురువారం (ఏప్రిల్ 2న) హనుమాన్‌ జయంతి సందర్భంగా చిరంజీవి అభిమానులతో ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తన నివాసంలోని పూజా మందిరంలో చోటుచేసుకున్న అపూర్వ దృశ్యాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియోలో హనుమంతుడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకిన క్షణం చిరంజీవిని ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. “సూర్య కిరణాలు మా హనుమంతుడిని స్పృశించిన ఈ అద్భుత క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతం” అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సప్తవర్ణాలుగా మారిన సూర్యకిరణాలు పూజా మందిరంలోని హనుమంతుడిని తాకే దృశ్యం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడిన అద్భుతాన్ని గుర్తుచేసుకుంటూ, కోణార్క్‌, అరసవల్లి దేవాలయాల్లో కూడా ఇలాంటి విశేషాలు జరిగాని తెలిపారు. ఈ  సందర్భంగా తన ఇంట్లో కూడా ఆంజనేయుడిని సూర్యకిరణాలు స్పృశించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి, ఈ పవిత్ర దినాన అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు” అని చిరంజీవి తెలియజేశారు.

©️ VIL Media Pvt Ltd.