
ప్రపంచవ్యాప్తంగా అనేక ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ (Netflix) మాత్రం అత్యధిక సబ్‌స్క్రైబర్లతో ముందంజలో ఉంది. మిగతా ఓటీటీలతో పోలిస్తే, నెట్‌ఫ్లిక్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం నెట్‌ఫ్లిక్స్ ఎంచుకునే కంటెంట్ నాణ్యత. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో వచ్చే సినిమాల్లో ఏదైనా బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌కు గ్లోబల్ స్థాయిలో మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.
ప్రస్తుతం క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్, డ్రామా వంటి ప్రతి జానర్‌కు చెందిన సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో విస్తృతంగా లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి జానర్ ప్రేక్షకుడి అభిరుచికి అనుగుణంగా కంటెంట్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ వారం (2026 April 3rd) ప్రేక్షకులను అలరించడానికి చాలా పెద్ద లిస్టుతోనే నెట్‌ఫ్లిక్స్ సిద్ధమైంది. ఏప్రిల్ 3 నాటికి స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, ఇప్పటికే వచ్చి ఆకట్టుకుంటున్న కంటెంట్ వైపు ఓ లుక్కేద్దాం..
‘మృత్యుంజయ్’(Mrithyunjay):
శ్రీవిష్ణు హీరోగా సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ మూవీ ‘మృత్యుంజయ్’(Mrithyunjay). మార్చి 6న విడుదలైన సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. హుస్సేన్ రైటింగ్, ట్విస్ట్‌లు బాగా వర్కవుట్ అయ్యాయి. తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్‌లో ఇదొకటి.
సినిమాలో పాటలు, కామెడీ సీన్లు ఉండవు. కేవలం కంటెంట్‌తోనే ఆడియెన్స్ను ఎంగేజ్ చేసింది. ఇపుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి రానుంది. మైండ్ గేమ్ ఎలిమెంట్స్‌తో నడిచే థ్రిల్లర్ కథ కావడంతో ఓటీటీ ఆడియన్స్ కు పండుగనే చెప్పాలి.
Not all hunters carry guns. Some just carry questions no one else dares to ask 🕵️♂️💪 pic.twitter.com/s2goctUAF3
— Netflix India South (@Netflix_INSouth) March 31, 2026
మృత్యుంజయ్ కథ:
హైదరాబాద్‌లో ఒక పేపర్ అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో జయ్ (శ్రీ విష్ణు) ఉద్యోగం చేస్తాడు. ‘శ్రద్ధాంజలి’ ప్రకటన ఇవ్వించడమే అతని పని. అయితే, ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్ కావాలని కలలు కంటున్న అతను, ఒక వారం వ్యవధిలో అనుమానాస్పదంగా జరిగిన రెండు మరణాలపై సందేహం పెంచుకుంటాడు.
వాటిలో ఒకటి చిన్నారి అంజలి (ఊహా రెడ్డి) తండ్రి అచ్యుత్‌రావు (బాలాదిత్య) మరణం. అది సహజ మరణం కాదని.. హత్య చేయబడిందని జయ్ అనుమానించి, ఏసీపీ సీతగా (రెబా మౌనిక జాన్) దృష్టికి తీసుకెళ్తాడు. అయితే ఆమె అది ప్రమాదమని భావిస్తుంది. చివరికి జయ్ తన అనుమానాన్ని ఎలా నిరూపించాడు? ఆ హత్యల వెనక నిజం ఏమిటి? అనేదే సినిమా కథ.
వధ్ 2 (Vadh 2):
జస్పాల్ సింగ్ సంధు దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వద్ (Vadh 2). ఇది 2022లో వచ్చిన వద్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది. ఇందులో సంజయ్ మిశ్రా మరియు నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. జైలు నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రేమ, నేరం, భావోద్వేగాల మేళవింపు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నేరం, శిక్ష అనే కాన్సెప్ట్‌ను చాలా న్యాచురల్‌గా చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది.
కథ విషయానికి వస్తే..
జైలు గార్డుగా శంభునాథ్ మిశ్రా (సంజయ్ మిశ్రా), జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీగా మంజు సింగ్ (నీనా గుప్తా) నటించారు. తాను చేయని రెండు హత్యల కేసులో ఆమె 28 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తుంటుంది. జైలులో ఉండగా ఈ ఇద్దరి మధ్య అనూహ్యమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇదే సమయంలో విడుదలకు దగ్గరలో ఉన్న మంజుకు ఈ బంధం ఓ ఆశ్రయంగా మారుతుంది.
మరోవైపు, స్థానిక రాజకీయ నాయకుడి తమ్ముడు కేశవ్ (అక్షయ్ డోగ్రా) జైలులో భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. కేశవ్ అకస్మాత్తుగా జైలు నుంచి మిస్ అవుతాడు. ఈ క్రమంలో కథ టెన్షన్, మిస్టరీతో మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన ఆఫీసర్ ఎంక్వయిరీలో ఏమేం నిజాలు బయటపడ్డాయి అనేది అసలు కథ.
మామ్లా లీగల్ హై సీజన్ 2:
రవి కిషన్ నటించిన పాపులర్ కోర్ట్‌రూమ్ కామెడీ సిరీస్ మామ్లా లీగల్ హై సీజన్ 2 (Maamla Legal Hai Season 2). ఏప్రిల్ 3, 2026న నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో విడుదల కానుంది. పాట్‌పర్‌గంజ్ జిల్లా కోర్టు నేపథ్యంలో సాగే ఈ కామెడీ డ్రామాలో, విడి. త్యాగి (రవి కిషన్) జడ్జిగా పాత్రను పోషిస్తూ మరింత హాస్యాన్ని, ఎమోషన్స్‌ను తీసుకురానున్నాడు. రాహుల్ పాండే తెరకెక్కించిన ఈ సిరీస్ కోర్టులోని విచిత్రమైన కేసులను, లాయర్ల సరదా కష్టాలను చూపించనుంది.
‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’
శివాజీ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ థియేటర్లలో ప్రదర్శన తర్వాత ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ డ్రామా, సస్పెన్స్, కామెడీ అంశాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది.
అయితే, మొదట్లో ఈ సినిమాకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ETV Win వద్ద ఉన్నాయని ప్రచారం జరిగినప్పటికీ, తర్వాత నెట్‌ఫ్లిక్స్ తో ఒప్పందం ఖరారైంది. శుక్రవారం ఏప్రిల్ 3 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
‘మర్దానీ 3’ (Mardaani 3):
బాలీవుడ్ సీనియర్ నటి రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘మర్దానీ 3’ (Mardaani 3) . అభిరాజ్ మినవాల దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 30న విడుదలైన ఈ చిత్రం ‘మర్దానీ’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా తెరకెక్కింది.
మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ వంటి అంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ హిట్ అయింది. ఇప్పుడు ఈ హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్ మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఆడియన్స్ ని వీపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇందులో డ్యూటీలో రాజీ పడకుండా ధైర్య సాహసాలను ప్రదర్శించే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ ముఖర్జీ ఇంప్రెస్ చేశారు. దేశంలో మిస్ అవుతున్న 93 మంది బాలికలను కాపాడేందుకు ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం.
కథేంటంటే:
ఢిల్లీలో ఇద్దరు అమ్మాయిలు.. ఒకరు బ్యూరోక్రాట్ కూతురు, సాధారణ కుటుంబానికి చెందిన మరొకరు కిడ్నాప్ అవుతారు. పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ (రాణీ ముఖర్జీ)కి పై అధికారులు ఆ కేసును అప్పగిస్తారు.శివాని మొదట్లో అది సాధారణ మిస్సింగ్ కేసు అనుకుంటుంది.
లోతుగా వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న బెగ్గింగ్ మాఫియా, చైల్డ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ బయటపడుతుంది. ఆ నెట్‌వర్క్‌ను నడిపేది అమ్మ (మల్లికా ప్రసాద్) అనే మహిళ. శివాని తన టీంతో 93 మంది అమ్మాయిలను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. అందులో భాగంగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ఆమ్మను ఎలా ఎదుర్కొంటుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాలి.
‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam).
మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య విడుదలైన అంబిషీయస్ సైన్స్ ఫిక్షన్ సైబర్ పంక్ థ్రిల్లర్ ‘మస్తిష్క మరణం’ (Masthishka Maranam). ఆర్కే కృష్ణన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 27, 2026 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథేంటంటే:
2046లో నియో కొచ్చి అనే ఫ్యూచరిస్టిక్ సిటీలో బిమల్ రాజ్ (నిరంజ్ మణియన్ పిళ్లై రాజు) అనే వ్యక్తి ఉంటాడు. అతను తన చిన్న కూతురి మరణం వల్ల కలిగిన బాధ నుంచి బయటపడలేకపోతాడు. అతని భార్య ఆ జ్ఞాపకాలను మెడికల్ ప్రొసీజర్ ద్వారా తొలగించుకుంటుంది. కానీ, బిమల్ మాత్రం వర్చువల్ రియాలిటీ మెమరీ గేమ్స్ ద్వారా తన బాధను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాడు.
ఒకసారి ఆ గేమ్‌లో సూపర్‌స్టార్ ఫ్రిడా సోమన్ (రజీషా విజయన్) మెమరీని యాక్సెస్ చేయడంతో అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆ మెమరీలో అతను ఫ్రిడాకు సంబంధించిన కొన్ని భయంకరమైన రహస్యాలు తెలుసుకుంటాడు. ఆమె చేసిన రెండు హత్యలకు ‘సాక్షి’ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా కథ.