Reading Time: < 1 minute

సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి :  కలెక్టర్ దిశానిర్దేశం

Caption of Image.
  • ఆఫీసర్లకు కలెక్టర్ దిశానిర్దేశం 

బజార్ హత్నూర్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో ఈనెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.

సభకు 30 నుంచి 50 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. తాగునీరు, పార్కింగ్, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా, తదితర వసతులు కల్పించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఆర్డీవో స్రవంతి, డీఎస్పీ జీవన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.