Reading Time: < 1 minute

150 ఎకరాలు దానం చేసిన భూస్వామి.. 30 మంది నిరుపేద రైతుల పేరుతో పట్టాలు

Caption of Image.

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఇచ్చోడ మండలానికి చెందిన కె.విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రెడ్డి తన తల్లి ఏనుగు ఆశాబాయి పేరున ఉన్న 150 ఎకరాల భూమిని రైతులకు దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆశాబాయిన పేరున బజార్‌‌‌‌‌‌‌‌హత్నూర్‌‌‌‌‌‌‌‌ మండలంలోని వర్తమన్నూర్‌‌‌‌‌‌‌‌ పంచాయితీ పరిధిలో 150 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ భూమిని కొన్నేండ్లుగా 30 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. 

రైతులంతా ఇటీవల ఆశాబాయిని కలిసి భూమిని పట్టా చేసి ఇవ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించి ఆశాబాయి భూమిని దానం ఇస్తున్నట్లు పట్టాలు చేయించాలని తన కుమారుడు విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రెడ్డికి సూచించారు. దీంతో విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌రెడ్డి మొత్తం 150 ఎకరాల భూమిని 30 మంది రైతులకు పట్టా చేయించగా, ఇటీవల అందరికీ పాస్‌‌‌‌‌‌‌‌బుక్స్‌‌‌‌‌‌‌‌ మంజూరు అయ్యాయి. భూమిని దానం చేసిన ఆశాబాయి కుటుంబ సభ్యులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.