
హైదరాబాద్, వెలుగు: మీసేవా చార్జీలు పెరిగాయి. ప్రభుత్వం ప్రస్తుతం మీసేవా సర్వీసులపై వసూలు చేస్తున్న చార్జీలను 50 శాతం పెంచింది. ఈ మేరకు బుధవారం సీఎస్రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన చార్జీలపై అదనంగా18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటిదాకా కేటగిరీ– ఏ కింద యూజర్ చార్జీలు రూ.35గా ఉండగా.. దానిని ఇప్పుడు రూ.62కు పెంచారు. కేటగిరీ– బీ కింద ఉన్న సేవలకుగానూ ప్రస్తుతం రూ.47 వసూలు చేస్తుండగా.. ఆ చార్జీలను రూ.80కి పెంచారు.
చార్జీలతో పాటు ఫస్ట్ నాలుగు పేజీల తర్వాత తీసుకునే ప్రతి పేజీ ప్రింట్, స్కానింగ్‌కు రూ.2.50 చొప్పున వసూలు చేయనున్నారు. ఇక, బిల్లుల చెల్లింపుల విషయంలోనూ కేటగిరీని బట్టి రేట్లను పెంచారు. కేటగిరీ–1లో బిల్లుల చెల్లింపు చార్జీలను రూ.20 నుంచి 35కి, కేటగిరీ– 2లో రూ.25 నుంచి రూ.44కు, కేటగిరీ– 3లో రూ.30 నుంచి రూ.53కి పెంచారు.