Reading Time: < 1 minute

పంటలకు వాడే పురుగు మందు మన ఒంట్లోకి ఇలా చేరడం.. ఫలితంగా కిడ్నీ ఫెయిల్యూర్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం !

Caption of Image.

పంటలకు వాడే పురుగు మందులో ఉండే ఈ రసాయనాలు ‘బయో మాగ్నిఫికేషన్’ ప్రక్రియ ద్వారా పంటల గింజలు, ఆకులు, కాయల నుంచి నేరుగా మన శరీరంలోకి చేరి ప్రాణాలను తీస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. నిమ్స్ వంటి హాస్పిటల్స్​లో నమోదవుతున్న కేసుల విశ్లేషణ ప్రకారం, పురుగు మందుల అవశేషాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్త క్యాన్సర్, లింఫోమా కేసులు గత పదేళ్లలో తెలంగాణలో 30 శాతం పెరిగాయి. కిడ్నీలు రక్తంలోని విషాలను శుద్ధి చేసే క్రమంలో ఈ భార లోహాల ధాటికి దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి.

ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌‌‌‌నగర్ జిల్లాల్లో కిడ్నీ రోగుల సంఖ్య పెరగడానికి సాగులో వాడుతున్న ఫాస్పేట్ ఎరువుల్లోని ఫ్లోరైడ్, కాడ్మియం అవశేషాలే కారణమని స్థానిక స్టడీస్ స్పష్టం చేశాయని పేర్కొన్నారు. కేవలం శారీరక వ్యాధులే కాకుండా, నాడీ వ్యవస్థ  సంతానోత్పత్తిపై కూడా ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

పురుగు మందుల ప్రభావంతో మెదడులోని నరాలు దెబ్బతిని పార్కిన్సన్స్ (వణుకు వ్యాధి), అల్జీమర్స్ వంటివి వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల యువతలో సంతానలేమి సమస్యలు విపరీతంగా పెరగడానికి ఆహారంలోని ఈ ‘ఎండోక్రైన్ డిస్రప్టర్స్’ ప్రధాన కారణమని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం, మహిళల్లో అండాల ఉత్పత్తి దెబ్బతినడం వంటివి నిత్యకృత్యమయ్యాయి. గర్భిణులు తీసుకునే ఆహారం ద్వారా ఈ విషాలు గర్భస్థ శిశువుకు చేరి, పిల్లల్లో ఎదుగుదల లోపాలు రావడానికి కారణమవుతున్నాయని పొందుపరిచారు.

©️ VIL Media Pvt Ltd.