Reading Time: < 1 minute
Telangana: కరెంటు షాక్‌తో మరణిస్తే రూ.8 లక్షలు.. పరిహారం పెంచిన ప్రభుత్వం

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న పరిహారాన్ని రూ.5 నుంచి 8లక్షలకు పెంచుతున్నట్టు విద్యుత్‌ నియంత్రణ మండలి పేర్కొంది. ఈ పెంపును ఈ నెల నుంచి అమల్లోకి తీసుకురావాలని డిస్కంలకు సూచించినట్టు నియంత్రణ మండలి స్పష్టం చేసింది. వినియోగదారుల పొరపాటు వల్ల ప్రమాదం జరిగినా ఇవే నిబంధన వర్తిస్తాయని నియంత్రణ మండలి పేర్కొంది. ప్రమాదం జరిగిన రెండు నెలల్లోనే బాధితులకు పరిహారం అందేలా చూడాలని, లేని పక్షాణ డిస్కంలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గతంలో ఈఆర్‌సీ అనుమతించినదానికన్నా వ్యరం రూ.7,635 కోట్ల అదనంగా పెరిగడంతో ట్రూఅప్‌ ఛార్జీలకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. అయితే ఈ డబ్బును కరెంటు బిల్లుల వసూళ్ల ద్వారా తీసుకోవద్దని తామే నిర్ణయం తీసుకుని తర్వాత చెపుతామని ప్రభుత్వం ఈఆర్‌సీకి చెప్పింది. రాష్ట్రంలో రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అది ముగిసేవరకు ట్రూఅప్‌ ఛార్జీలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు ఈఆర్‌సీ స్పష్టం చేసింది.

పర్మిషన్ తీసుకున్న లోడుకన్నా ఎక్కువ కరెంటును యూజ్ చేసే హైటెన్షన్‌ వినియోగదారుల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయడాన్ని సమర్థించినప్పటికీ.. దీనిపై వాళ్లకు ఎలాంటి అవగాహన కల్పించకుండా అమల్లోకి తెచ్చినందున.. తొలి 2 నెలలు వసూలు చేసిన అదనపు బిల్లును తిరిగివ్వాలని డిస్కంలను ఆదేశించింది. రాబోయే 6 నెలల బిల్లుల్లో ఆ మొత్తాన్ని క్లియర్ చేయాలని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.