
ఆర్‌ఎక్స్100, మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం ’శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నవరసరాయ డా. నరేష్ వికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ స్వాతంత్ర బాబు పాత్ర పోషిస్తున్నారు. ఒక చేతిలో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని డాన్స్ వైబ్‌లో కనిపించిన నరేష్ లుక్ ఆకట్టుకుంది. అగ్ర నిర్మాత అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి.కిరణ్ నిర్మిస్తున్నారు.