Reading Time: < 1 minute

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలిగిన తర్వాత కూడా నితీష్ కుమార్ ‘Z+’ స్థాయి భద్రతను పొందనున్నారు. రాష్ట్ర హోం శాఖకు చెందిన ప్రత్యేక విభాగం ఈ మేరకు ఉత్తర్వును జారీ చేసింది. ‘బీహార్ ప్రత్యేక భద్రతా చట్టం, 2000’ ప్రకారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ Z+ భద్రతను పొందే అర్హత కలిగి ఉన్నారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో నితీష్ కుమార్.. సిఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో, నితీష్ కుమార్ భద్రతా అవసరాలను సమీక్షించిన అనంతరం, ఆయనకు ‘Z+’ స్థాయి భద్రతను కల్పించాలని నిర్ణయించారు. కాగా, ‘Z+’ భద్రతాలో పోలీసు సిబ్బందితో పాటు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కు చెందిన 10 మందికి పైగా కమాండోలతో కలిపి దాదాపు 36 మంది సిబ్బంది విధులను నిర్వర్తిస్తారు.