
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు దగ్గర జరిగిన ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ( ఏప్రిల్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మొదటి ఘాట్ రోడ్డులో 22వ మలుపు దగ్గర అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది ఓ బైక్. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుమల నుండి తిరుపతికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని 108లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.