Reading Time: < 1 minute
Stock Market Crash Sensex Nifty Fall Trump War Comments Impact

దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఒక్కరోజు లాభాలు ఆవిరైపోయాయి. నిన్నటి రోజున భారీ లాభాల్లో పుంజుకున్న మార్కెట్.. తాజాగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా.. దేశీయంగా మార్కెట్లు కుదేల్ అయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1,391 పాయింట్లు నష్టపోయి 71, 743 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 438 పాయింట్లు నష్టపోయి 22,232 దగ్గర కొనసాగుతోంది.

ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, మెటల్, మీడియా రంగాల సూచీలు 2-3 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు చెరో 2 శాతం కంటే ఎక్కువగా తగ్గాయి. ఎన్‌ఎస్‌ఈలో అత్యంత చురుకైన షేర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, గణేషా ఎకోస్పియర్, వి-మార్ట్ రిటైల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, గార్డెన్ రీచ్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌తో ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదు.. 3 వారాల్లో కఠిన చర్యలుంటాయని వార్నింగ్