Reading Time: < 1 minute
Divya Dutta Career Turning Point Aditya Chopra Advice Chiraya Web Series

ప్రస్తుతం ఓటీటీలో ‘చిరాయా’ (Chiraya) వెబ్ సిరీస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో మారిటల్ రేప్ వంటి సున్నితమైన అంశంపై దివ్య దత్తా తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.

Also Read : Euphoria OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘యుఫోరియా’..

16 ఏళ్లకే సినీ రంగంలోకి వచ్చిన దివ్య దత్తాకు ‘వీర్ జారా’ సినిమాతో ఒక్కసారిగా భారీ గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు అవకాశాల కోసం ఎదురుచూసిన ఆమెకు, ఆ హిట్ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. దాంతో ఏకంగా 20 సినిమాలకు ఆమె సంతకం చేసేసింది. అయితే ఇదే విషయాన్ని గర్వంగా ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రాకు చెప్పగా, ఆయన వేసిన ప్రశ్న ఆమెను ఆలోచనలో పడేసింది.”నువ్వు కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తావా? లేక ఒక మంచి నటిగా లెగసీని వదిలి వెళ్తావా?” అని ఆదిత్య చోప్రా అడిగారు.

ఆర్థిక ఇబ్బందులు లేనప్పుడు కేవలం డబ్బు కోసం అన్ని సినిమాలు చేయడం వల్ల నటిగా నీ గుర్తింపు పోతుందని ఆయన సలహా ఇచ్చారట. అది విన్న వెంటనే దివ్య దత్తా మేల్కొని, అప్పటివరకు ఇంకా షూటింగ్ మొదలవ్వని సినిమాల అడ్వాన్స్‌లను (కోట్ల రూపాయలు) నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసింది. ఆ ఒక్క నిర్ణయం వల్లే ఆమెకు ‘భాగ్ మిల్ఖా భాగ్’, ‘బాద్లాపూర్’, ‘ఇరాదా’ వంటి గొప్ప చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. 2017లో ‘ఇరాదా’ చిత్రానికి గాను ఆమె జాతీయ అవార్డును కూడా అందుకుంది.