Reading Time: < 1 minute

మనతెలంగాణ/హైదరాబాద్:‘తెలంగాణ రైజిం గ్’ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులోనూ తెలంగాణ ఆశించిన లక్ష్యాన్ని సాధించింది. వర ల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పెట్టుబడులకు మించి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభు త్వ సంకల్పం నెరవేరింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడుల ను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కా ర్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒ ప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది.

ఈ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర ల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన చేసిన ప్రసంగం హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ ఫోరం నిర్వహించాలనే ప్రతిపాదన కు సానుకూల స్పందన లభించింది. మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రము ఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్ర త్యేక సెషన్ల అనంతరం మూడు రోజు ల తెలంగాణ ప్రతినిధి బృందం దావోస్ ప ర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దా వోస్‌లో కార్యక్రమాలు ముగించుకొని సిఎం రేవంత్ రెడ్డి జూరిచ్ బయల్దేరారు. అక్కడి నుంచి సిఎం అమెరికా పర్యటనకు వెళుతున్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దావోస్ నుంచి ఇండియాకు తిరుగు పయనమయ్యారు.