
వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే వార్తల ప్రసారాన్ని జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఖండించారు. ఐఎఎస్ అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం గర్హనీయమని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ సమాజానికి ప్రాణవాయువులాంటిదని పేర్కొన్నారు. రాజ్యాంగం పరిమితుల్లేని స్వేచ్ఛకు హామీ ఇవ్వలేదని తెలిపారు. భాద్యత లేకుండా భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించరాదని స్పష్టం చేశారు. దుర్వినియోగం చేస్తే నియంత్రణా అదేస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో స్వీయ నియంత్రణ అవసరమని గుర్తు చేశారు. సమర్థంగా పని చేసే యువ అధికారిణుల పట్ల అమర్యాద తగదని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఇతరుల వ్యక్తిత్వం దెబ్బ తీయకూడదని తెలిపారు. పురుషాధిక్య భావజాలంతో దుశ్చర్యలకు పాల్పడవద్దని పేర్కొన్నారు.