Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: ఆర్డర్ చేసిన పదే పది నిమిషాల్లో ఆ వస్తువుని మీ దగ్గరకు తీసుకొచ్చే సేవలను రద్దు చేయాలని కేంద్రం ఆన్‌లైన్ కామర్స్ సంస్థలకు సూచించింది. క్విక్ డెలివరీ తొలగింపు అంశంతో పాటు పలు డిమాండ్లతో గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్తంగా సమ్మె చేసిన సంగతి తెలిసిందే. దీంతో వర్కర్ల భద్రతా దృష్ట్యా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ.. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సహా పలు క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా పది నిమిషాల నిబంధనను తొలగించేలా ఆయా సంస్థలను ఒప్పించినట్లు తెలిసింది.

ఇప్పటికే ఈ సేవలను నిలిపివేయాలని జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ నిర్ణయించినట్లు సమాచారం. మిగితా సంస్థలు ఇదే తరహా నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిగ్ వర్కర్ల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్ర ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.