
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ.. రాకెట్ ఫోర్స్ ఏర్పాటు భారత్‌కు తక్షణావసరం అని అన్నారు. ఇప్పటికే చైనా, పాక్‌లు ఈ రాకెట్ ఫోర్స్ పెంచుకున్నాయని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయని పేర్కొన్నారు. పాక్‌లో 8 ఉగ్ర శిబిరాలు ఇంకా చురుగ్గా ఉన్నాయని.. ఆ ఎనిమిది ఉగ్ర శిబిరాల్లో 150 మంది ఉండొచ్చు అని అంచనా వేశారు. బారత్‌పై దాడులకు పాక్ ఇంకా సహకరిస్తూనే ఉందని.. భారత్‌లోకి పాక్ గూఢచార డ్రోన్‌లను పంపుతోందని తెలిపారు.