
టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 49 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక రాజ్‌కోట్ వేదికగా కివీస్‌తో రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ను ఓ రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ వన్డేల్లో 68 ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 47.83 యావరేజ్‌తో 2,966 పరుగులు చేశాడు. రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లో మరో 34 పరుగులు చేస్తే అత్యంత వేగంగా మూడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని టీం ఇండియా పట్టుదలతో ఉంది.