Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మార్గంలో జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఒఆర్ఆర్ నుంచి బాటసింగారం వరకు వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.