
అమరావతి: కోనసీమలో జరిగే ఒఎన్ జిసి బ్లో అవుట్ వెనక కుట్ర దాగి ఉందని వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. డీప్ ఇండ్రస్ట్రీస్ కు బావులు కేటాయించడం వెనక మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బావుల కేటాయింపు కోసం వేల కోట్లు చేతులు మారాయని, ప్రభుత్వ పెద్దలు ప్రమాదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బ్లో అవుట్ కుట్రపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని సూచించారు. ప్రమాదం వెనక పూర్తిగా భద్రతా వైఫల్యం ఉందని మండిపడ్డారు. ప్రమాదం జరగగానే కంపెనీ ప్రతి నిధులు ఎందుకు వెళ్లిపోయారు? అని డీప్ ఇండస్ట్రీస్ బదులు ఒఎన్ జిసి నష్టం ఎందుకు భరిస్తోందని ప్రశ్నించారు. విచారణ జరిపితే నిజాలు నిగ్గుతేలే అవకాశముందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.