
చార్మింగ్ స్టార్ శర్వా పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్‌టైనర్ నారి నారి నడుమ మురారితో అలరించబోతున్నారు. ఈ సినిమా జనవరి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్, మొదటి రెండు పాటల ద్వారా భారీ అంచనాలను పెంచింది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఆకట్టుకునే కథనం, నవ్వులతో నిండిన స్క్రీన్‌ప్లేతో ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఆత్రేయపురంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. హీరో శర్వా మాట్లాడుతూ “అందరూ కూడా మా సినిమాకు వచ్చి ఆనందంగా నవ్వితే అదే మాకు పండగ. అది మీరందరూ మాకు ఇచ్చే కానుక. ఇది చాలా క్లీన్ ఫిలిం. మంచి కథని చాలా హాస్యంగా చెప్పడం జరిగింది”అని అన్నారు. హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ “థియేటర్లో ఫ్యామిలీతో పాటు అందరూ ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఈ సినిమాని పూర్తి ఎంటర్‌టైనర్ గా ప్యాక్ చేశారు. నాకు దియా అనే క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్యూ”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి వైద్య, రామ జోగయ్య శాస్త్రి పాల్గొన్నారు.