Reading Time: < 1 minute

 అగ్ని ప్రమాదంలో 38 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంక గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 120 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. విద్యుదాఘాతం వలన ప్రమాదం జరిగి గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఘటన సమయంలో గ్రామంలోని కొందరు సంక్రాంతి పండుగ సందర్భంగా కొనుగొళ్ల కోసం తుని కి వెళ్లగా,  మరికొందరు ఘటనస్థలంలో ఉన్నారు. వెంటనే అప్రమత్తమవ్వడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.