
WPL 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబి)తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటర్లు తడబడటంతో యూపి వారియర్స్ మోస్తరు స్కోరు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో యూపి వారియర్స్, ఆర్సీబికి 144 పరుగుల టార్గెట్ నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన యూపి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన 143 పరుగులు మాత్రమే చేయగలిగింది.
యూపి వారియర్స్ బ్యాటర్లలో దీప్తి శర్మ(45 నాటౌట్), డియాండ్రా డాటిన్(40)లు రాణించగా.. ఫోబ్ లిచ్‌ఫీల్డ్(20) ఫర్యాలేదనిపించగా.. ఓపెనర్ హర్లీన్ డియోల్(11), కెప్టెన్ లానింగ్(14), కిరణ్ నవ్‌గిరే(5), శ్వేతా సెహ్రావత్(0)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఇక, బెంగళూరు బౌలర్లలో నాడిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. లారెన్ బెల్ ఒక వికెట్ తీసింది.