Reading Time: < 1 minute

చిరుత నోటికి చిక్కిన ఆవు  చాకచక్యంగా వ్యవహరించి  ప్రాణాలతో బయటపడిన సంఘటన రాజస్థాన్ లోని హిల్స్ టైగర్ రిజర్వ్ పారెస్ట్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. హిల్స్ టైగర్ రిజర్వ్ ని కొలిపుర ప్రాంతంలో ఓ ఆవు మేత కోసం వెళ్లగా ఆవుపై చిరుత దాడి చేసింది. అయితే ఆవు చిరుత పై ప్రతిఘటించింది. కొంతసేపు చిరుత ఆవు మెడను పట్టుకొని చంపాడానికి ప్రయత్నించింది. చిరుత ఎంత ప్రయత్నించిన ఆవును చంపలేకపోయింది. చివరకు చిరుత అడవిలోకి పారిపోయింది. దీంతో ఆవు ప్రాణాలతో బయటపడగలిగింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. ఈ దృశ్యాలను స్థానికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.