Reading Time: < 1 minute

హైదరాబాద్: ప్రభాస్ నటిచిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’. మారుతి దర్శకత్వంలో హారర్, కామెడీ ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. మొదటి షో నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ మొదటి రోజు ఏకంగా రూ.112 కోట్లు వసూళ్లు రాబట్టింది. అయితే తర్వాతి రోజు నుంచి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.183 కోట్లు కోట్లు మాత్రమే వసూలు చేసింది.

చూస్తుంటే పెట్టుబడి రావడం కూడా కష్టమే అని అనిపిస్తోంది. మరోవైపు సోమవారం (జనవరి 12న) చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. దీంతో రాజాసాబ్ వసూళ్లకు పెద్ద దెబ్బ పడేట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించగా.. సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు.