Reading Time: < 1 minute

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి పండగను పురస్కరించుకొని గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డిఎను 3.64 శాతం పెంచుతున్నట్లు పేర్కొంది. 2024 జులేై 1 నుంచి పెరిగిన డిఎ వర్తించనుంది. పెరిగిన డిఎ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకూ డిఎ బకాయిలు జిపిఎఫ్ ఖాతాలో జమ కానున్నాయి.