
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. దేవాలయం వెనుక ద్వారం నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి నగలు చోరి చేసినట్లు సోమవారం గుర్తించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులకు ఆలయ ధర్మకర్త ముకుందపండా సమాచారం ఇచ్చారు. సుమారు రూ.60 లక్షల విలువ చేసే ఆభరణాలు చోరికి గురైనట్లు ఆయన చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబాజ్ అహ్మద్, సిఐ రామకృష్ణ పరిశీలించారు.
ఈ దేవాలయంలోనే నవంబర్ 1న తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొక్కిసలాట అనంతరం పోలీసుల ఆదేశాల మేరకు దేవాలయంలో దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.