Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఎస్‌ఐ సమక్షంలో మందుగుండు సామాగ్రిని పోలీసులు పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్ల తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణంలో నిలిపి ఉంచిన వాహనం, వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చల్లపల్లి సిఐ ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు గల కారణాలపై ఆరా తీశారు. పిఎస్ లో ఉన్న బాణాసంచాను కోర్టుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.