Reading Time: < 1 minute

బెంగళూరు: సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరేసుకొని చనిపోవడంతో అతడి ప్రియురాలు భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిద్దిపేటకు చెందిన కుంట బాబు చందర్ రెడ్డి(32) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. బెంగళూరులోని కొత్తనూరు ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ నివాసం ఉంటున్నాడు. అతడి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. బాబు చందర్ రెడ్డి తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో వెంటనే యువతి 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య పాల్పడింది. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని బాబు చందర్ రెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. తీవ్ర మానసిక ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సహజీవనం విషయం తమకు తెలియని మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.