
బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. హుజూరాబాద్‌లో జరిగిన మినీ సమ్మక్క-సారలమ్మ జాతర సమయంలో చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన కేసులో మంగళవారం కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తులో ఉన్న పోలీసుల విధులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కౌశిక్ రెడ్డి కలిగించారని.. అంతేకాకుండా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ఐసిఎస్ ల సంఘం కూడా కౌశిక్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా ఈ కేసులో ఆయనకు నోటీసులు ఇచ్చిన సిఐడి.. ఏప్రిల్ 4న ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది.