Reading Time: 2 minutes

ఏప్రిల్ నెలలో బ్యాంకులకు 14 రోజులు హాలిడేస్.. ఏఏ తేదీల్లో అంటే..?

Caption of Image.

ఏప్రిల్ నెల వచ్చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో పాటు వరుస పండుగలు, సెలవులతో బ్యాంకులు బిజీగా మారనున్నాయి. వివిధ కారణాలతో 2026 ఏప్రిల్‌లో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఇందులో కొన్ని దేశవ్యాప్త సెలవులు ఉంటే.. మరికొన్ని ప్రాంతీయ పండుగలు ఉన్నాయి. రిజర్వు బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం తేదీల వారీగా సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు బ్యాంకుకు వెళ్లాలనుకుంటే ఖచ్చితంగా వీటిని పరిశీలించి ప్లాన్ చేసుకోండి. 

ఏప్రిల్ నెలలో సెలవుల వివరాలు..

April 1 – దేశవ్యాప్తంగా వార్షిక బ్యాంక్ సెలవు దినం
April 2 – ఈస్టర్ ముందు పవిత్ర గురువారం సెలవు
April 3 – గుడ్ ఫ్రైడే సెలవు
April 5 – ఆదివారం సెలవు
April 11 – రెండవ శనివారం సెలవు
April 12 – ఆదివారం సెలవు
April 14 – డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సెలవు
April 15 – బెంగాలీ న్యూ ఇయర్
April 16 – భోగహ్ బిహు హాలిడే
April 19 – ఆదివారం సెలవు
April 20 – అక్షయ తృతీయ సెలవు
April 21 – గరియా పూజ సెలవు(త్రిపురలో)
April 25 – నాలుగో శనివారం సెలవు
April 26 – ఆదివారం సెలవు

RBI రూల్స్ ప్రకారం మన దేశంలో బ్యాంక్ సెలవులను ప్రధానంగా మూడు రకాలుగా విభజించారు. మొదటిది నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద వచ్చే పబ్లిక్ హాలిడేస్, రెండోది రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సెలవులు, చివరిగా మూడోది ఏప్రిల్ 1న జరిగే బ్యాంకుల వార్షిక క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ హాలిడే. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా, ప్రాంతీయ పండుగలను బట్టి మారుతుంటాయి. కాబట్టి వినియోగదారులు తమ ప్రాంతంలోని స్థానిక సెలవుల జాబితాను ముందుగానే చెక్ చేసుకోవడం బెటర్.

బ్యాంక్ శాఖలు మూసి ఉన్నప్పటికీ.. డిజిటల్ సేవలు మాత్రం నిరంతరం అందుబాటులో ఉంటాయి. అత్యవసర నగదు అవసరాల కోసం ఏ బ్యాంకు ఏటీఎంనైనా వాడుకోవచ్చు. అలాగే నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్, యూపీఐ సేవలు 24 గంటలూ పనిచేస్తాయి. సో సెలవు రోజులో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా తమ పనులు కొనసాగించవచ్చు. అయితే నేరుగా బ్యాంకుకు వెళ్లి పూర్తి చేయాల్సిన పనులు ఏవైనా ఉన్నట్లయితే తప్పకుండా సెలవులను గమనించి వెళ్లటం బెస్ట్.

©️ VIL Media Pvt Ltd.