
జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ ద్వారా పాపులర్ అయిన సుధీర్ ఆతర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టాడు. ఆతర్వాత మెల్లగా టీమ్ లీడర్ అయ్యింది తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నాడు. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన సుధీర్ ఆతర్వాత హీరోగా మారాడు. సుదీర్ హీరోగా వేర్ ఈజ్ విద్యా బాలన్, నేనోరకం, సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్, జ, కోతల రాయుడు, వాంటెడ్ పండుగాడ్, కాలింగ్ సహస్త్ర వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు గోట్ అనే సినిమాతో పేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా త్వరలోనే రాబోతుంది. ఇదిలా ఉంటే సుదీర్ గురించి ఓ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి
ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఇంద్రజ ఇప్పుడు పలు టీవీ షోల్లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సుడిగాలి సుధీర్, అలాగే చంద్ర, అభి, శ్రీను వంటి ఇతర ప్రముఖ కమెడియన్లు జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీల నుంచి వెళ్లిపోవడంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సుడిగాలి సుధీర్‌ను వ్యక్తిగతంగా మిస్ అవుతున్నారా అని అడిగినప్పుడు, ఇంద్రజ భావోద్వేగానికి లోనయ్యారు. “ఖచ్చితంగా.. విపరీతమైన బాండింగ్ అసలు,” అని ఆమె అన్నారు. వారి అనుబంధం ఎంత బలమైనదో వివరిస్తూ, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రామ్ ప్రసాద్ చేసిన ఒక స్కిట్‌ను గుర్తు చేసుకున్నారు. సుధీర్ లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ ఎలా ఒంటరివాడు అయిపోయాడో చూపించిన ఆ స్కిట్, ప్రేక్షకులతో పాటు తనను కూడా కదిలించిందని తెలిపారు. కెవ్వు కార్తీక్ సుధీర్ లాగా అభినయించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, అప్పుడు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె చెప్పారు. “నేను ఏడ్చేశా నాకు ఆపుకోలేకపోయాను అని తెలిపింది. ఆ సంఘటన సుధీర్‌ను ఎంతగా మిస్ అవుతున్నారో తెలియజేసిందని చెప్పారు.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
సుధీర్‌ను సిద్దు అని పిలవడానికి గల కారణాన్ని కూడా ఇంద్రజ వెల్లడించారు. ఒక శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో సుధీర్ అక్కయ్య ఇంట్లో అతన్ని సిద్దు అని పిలుస్తారని చెప్పారని, అప్పటి నుంచి తాను కూడా ఆ పేరుతోనే పిలుస్తున్నానని తెలిపారు. సుధీర్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని చెప్పారు. ఈ పరస్పర ప్రేమను, అనుబంధాన్ని ఆమె చాలా అమూల్యమైనదిగా భావిస్తారు. అది ఆక్టింగ్ కాదు, కెమెరా కోసం చేసింది అయితే కాదు, అని ఆమె స్పష్టం చేశారు. తమ మధ్య వయసులో 7-8 సంవత్సరాల తేడా ఉన్నప్పటికీ, వారిది ఒక తల్లి-కొడుకు అనుబంధం లాంటిదని, సుధీర్‌కు తనపై ప్రత్యేకమైన మదర్లీ ఫీల్ ఉందని ఇంద్రజ పేర్కొన్నారు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.